: ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉన్నారు!: చంద్రబాబు


విద్యతో ప్రపంచ జ్ఞానం వస్తుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా మహిళలు అక్షరమే ఆయుధంగా చదువుకోవాలని, దాని ద్వారా మంచి ఆదాయం సాధ్యమవుతుందని చెప్పారు. మహిళా సంఘాలు సంఘటిత శక్తిగా ఎదగాలని సీఎం కోరారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోని చదువుకోని వారిలో 50 శాతం మంది మనదేశంలోనే ఉన్నారని చెప్పారు. అక్షరాస్యతలో మనం 31వ స్థానంలో ఉన్నామని చెప్పారు. 2020 నాటికి పూర్తి అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ పాలనలో 17 శాతం అక్షరాస్యత పెరిగితే, అదే కాంగ్రెస్ పది సంవత్సరాల పాలనలో కేవలం 6.5 శాతం మాత్రమే అక్షరాస్యత పెరిగిందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News