: రచయిత అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజీ తొలి స్మారక పురస్కారం


కాళోజీ జయంతిని పురస్కరించుకుని ప్రదానం చేసే స్మారక పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్ ను తొలి పురస్కారానికి ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 9న కాళోజీ జయంతి నాడు నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. తెలంగాణలో భాష, సాహిత్య రంగాల్లో కృషి చేసిన వారికి ఈ పురస్కారం ఇవ్వనున్నారు. మరోవైపు ఇదే రోజున తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగాను, హైదరాబాద్ లోను అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News