: సీడబ్ల్యూసీ కీలక భేటీ నేడు... సోనియా అధ్యక్ష పదవీకాలం పొడిగింపుపై చర్చ?
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవీ కాలం దాదాపుగా ముగియవస్తోంది. అదే సమయంలో ఏఐసీసీని సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా స్థానంలో రాహుల్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని పలువురు నేతలు బహిరంగంగానే గళమెత్తుతున్నారు. ఈ క్రమంలో నేటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుందని విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో బీహార్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపైనా ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.