: పీవోకేను ఎలా వెనక్కి తీసుకోవాలన్నదే పెద్ద సమస్య: కేంద్రమంత్రి జితేంద్రసింగ్
పాకిస్థాన్ అధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను ఎలా వెనక్కి తీసుకోవాలన్నదే పెద్ద సమస్య అని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. కాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షఫీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు ముగిసిన సందర్భంగా రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో కాశ్మీర్ సమస్య ఇంకా ముగియలేదని, త్వరలో పరిష్కరించుకోవాలంటూ షఫీ వ్యాఖ్యానించడం తెలిసిందే.