: ఆ అస్థికలు షీనా బోరావే... ఫోరెన్సిక్ నిపుణులు


రాయ్ గఢ్ నుంచి స్వాధీనం చేసుకున్న అస్థికలు షీనా బోరావేనని పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. రాయ్ గఢ్ జిల్లాలో వెలికితీసిన పుర్రె, ఇతర ఎముకలను ఇంద్రాణి ముఖర్జియా శాంపిల్స్ ను కలినాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ విశ్లేషణ చేసింది. అనంతరం, ఇద్దరి డీఎన్ఏలు ఒక్కటేనని నిపుణులు తెలిపారు. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాతో పాటు కారు డ్రైవర్ కు ఈ రోజు కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News