: ఏపీలో మహిళా సాధికారయాత్రకు చంద్రబాబు శ్రీకారం... త్వరలో 'అన్న సంజీవిని' ఫుడ్ క్యాంటిన్లు


విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ది శాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో అక్టోబర్ 2 నుంచి మహిళా సాధికారయాత్ర చేపడతామని తెలిపారు. డ్వాక్రా గ్రూపులకు అన్న సంజీవిని, ఫుడ్ క్యాంటీన్ లను అప్పగించాలని, అలాగే ప్రతి ఇంట్లో ఒక మహిళకు కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించాలని నిర్ణయించారు. 2019 నాటికి డ్వాక్రా గ్రూపులు వంద శాతం అక్షరాస్యత సాధించాలని చంద్రబాబు సూచించారు. త్వరలోనే అన్న సంజీవిని ఫుడ్ క్యాంటీన్లు ప్రవేశపెట్టబోతున్నట్టు వెల్లడించారు. డ్వాక్రా మహిళలు నైపుణ్యాన్ని పెంచుకోవాలని, నాలుగేళ్లలో నెలవారీ ఆదాయం రూ.10వేలకు పెరగాలని చెప్పారు. త్వరలోనే అక్షర వెలుగు లేదా అక్షర సంక్రాంతి పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. మహిళలు తమ ఉత్పత్తులను ఆన్ లైన్ లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. టెక్స్ టైల్స్, గొర్రెల పెంపకం, జీవనధార, క్యాంటీన్ల నిర్వహణతో మహిళా సంఘాల ఆదాయం పెంచుతామని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News