: ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే...రాజీవ్ త్రివేదీకి ఊరట!


ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి విజయవాడ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన నోటీసులపై ఉమ్మడి హైకోర్టు స్టే ఇచ్చింది. దాంతో త్రివేదీకి ఊరట లభించింది. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉందని, విజయవాడ కోర్టు ఎలా నోటీసులిస్తుందని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. అంతేగాక కాల్ డేటాను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఏపీ ఏజీ అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని కాల్ డేటాను భద్రపరచాలంటూ గత నెలలో విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన నోటీసులను ఏపీ సీఐడీ అధికారులు రాజీవ్ త్రివేదీకి అందజేశారు. ఈ క్రమంలో ఆయన పిటిషన్ ద్వారా హైకోర్టుకు వెళ్లడంతో పైవిధంగా స్పందించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News