: నవ్యాంధ్రలో చంద్రబాబు గృహ ప్రవేశం... భార్యతో కలిసి కొత్తింటిలో అడుగు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర రాజధాని సమీపంలో నిన్న తన కొత్తింటిలో గృహప్రవేశం చేశారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన కొత్తింటిలో అడుగుపెట్టారు. విజయవాడ సమీపంలో కృష్ణా నదికి ఆవలి వైపు గుంటూరు జిల్లా ఉండవల్లి పరిధిలో లింగమనేని గ్రూపునకు చెందిన గెస్ట్ హౌస్ ను సీఎం తన నివాసంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. మంచి రోజు అన్న భావనతో గత నెల 29నే భువనేశ్వరి ఆ ఇంటిలో పాలు పొంగించారు. తాజాగా నిన్న చంద్రబాబు ఈ నివాసంలోకి అడుగుపెట్టారు. ఇకపై విజయవాడలో ఉన్నన్ని రోజులు ఆయన ఈ ఇంటిలోనే ఉంటారు. ఇదిలా ఉంటే, కొత్తింటిలోకి చంద్రబాబు ప్రవేశించిన వెంటనే భారీ వర్షం కురిసింది.