: బ్లాక్ మనీ గుట్టు విప్పితే... రూ.15 లక్షల రివార్డు: ఐటీ శాఖ బంపర్ ఆఫర్!


‘నల్ల’ కుబేరులకు సంబంధించిన స్పష్టమైన సమాచారమిస్తే భారీ రివార్డు ఇవ్వనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ వెల్లడించింది. అక్రమార్జనతో భారీగా నల్లధనం కూడబెడుతున్న వారికి సంబంధించిన కీలక సమాచారం అందిస్తే రూ.15 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఆ శాఖ నిన్న ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని కూడా అందించవచ్చని పేర్కొంది. నల్లధనంపై సమాచారం అందిస్తే... సదరు ‘నల్ల’ కుబేరుడు పోగేసిన అక్రమార్జనలో 10 శాతం సొమ్మును అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ మొత్తం రూ.15 లక్షలకు మించదని వెల్లడించింది. నల్లధనంపై సమాచారమిచ్చే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, వ్యవహారం కోర్టు మెట్లెక్కితేనే సదరు వ్యక్తి సమాచారం బహిర్గతం చేస్తామని పేర్కొంది.

  • Loading...

More Telugu News