: యాంకర్ పై విరుచుకుపడ్డ మాజీ విశ్వసుందరి


మాజీ విశ్వసుందరికి బదులుగా మాజీ ప్రపంచ సుందరి అంటూ సంబోధించిన యాంకర్ పై సుస్మితాసేన్ విరుచుకుపడింది. మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మిత ఓ టీవీ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. కలుపుగోలుగా ఉండే సుస్మితాసేన్ ఉన్నట్టుండి ఫైర్ అవడంతో అక్కడ ఉన్న వారితో పాటు, ఆ వ్యాఖ్యలు చేసిన సదరు వ్యాఖ్యాతకు ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. తాను మాజీ విుస్ వరల్డ్ కాదని మాజీ మిస్ యూనివర్స్ అని, వ్యాఖ్యానించే ముందు, క్షుణ్ణంగా తెలుసుకోవాలని సుస్మిత మండిపడిందట.

  • Loading...

More Telugu News