: ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్న సైనికులకు ఓఆర్ఓపీ: ప్రధాని మోదీ
ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్న ఆర్మ్ డ్ ఫోర్సెస్ కు కూడా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం వర్తిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. హర్యానాలో ఢిల్లీ మెట్రో లైన్ ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఓఆర్ఓపీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోవడానికి ఒక కమిషన్ ను ప్రతిపాదించినట్టు మోదీ తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటనతో వీఆర్ఎస్ తీసుకున్న ఆర్మ్ డ్ ఫోర్సెస్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.