: తెలంగాణ సాధించుకున్నది భూకబ్జాలు చేసేందుకు కాదు: తలసానిపై షబ్బీర్ అలీ ధ్వజం


టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. తలసాని సోదరుడు శంకర్ యాదవ్ బోయిన్ పల్లిలో ఉన్న ప్రాగ హౌసింగ్ సొసైటీ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ భూమి సత్యం రామలింగరాజుకు చెందినది అంటూ భూవివాదంలో శంకర్ యాదవ్ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. హౌసింగ్ సొసైటీ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నది భూకబ్జాలు చేయడానికి, అమాయకులపై దాడులు చేసేందుకు కాదని అన్నారు.

  • Loading...

More Telugu News