: ఇండియన్ ఎయిర్ లైన్స్ నిర్వాకంతో మక్కాలో కట్టుబట్టలతో నిలిచిన తెలంగాణ యాత్రికులు!


ఇండియన్ ఎయిర్ లైన్స్ అధికారుల నిర్వాకం, హజ్ యాత్రకు వెళ్లిన తెలంగాణ వాసులను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. హైదరాబాద్ నుంచి మక్కాకు చేరుకున్న తెలంగాణ ముస్లింల లగేజీలను వారికి అందించడంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ విఫలమైంది. వీరంతా మూడు రోజుల క్రితం మక్కా చేరుకోగా, ఇంతవరకూ లగేజీలు అక్కడికి చేరలేదు. దీంతో వారంతా కట్టుబట్టలతో తమ బ్యాగేజీల కోసం విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని యాత్రికులు కోరుతున్నారు. వీరు వెళుతున్న విమానంలో బరువు ఎక్కువైన కారణంగా మరో విమానంలో లగేజీలు పంపుతామని చెప్పిన ఇండియన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది, ఇంతవరకూ ఆ పని చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News