: బంగ్లాదేశ్-ఏ జట్టుతో షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ


బంగ్లాదేశ్-ఏ జట్టుతో భారత-ఏ జట్టు ఆడనున్న షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఖరారు చేసింది. ఈ సిరీస్ లో భారత- ఏ జట్టు బంగ్లాదేశ్-ఏ జట్టుతో మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. అలాగే రెండు, మూడు రోజుల మ్యాచ్ లు కూడా ఆడనుంది. మూడు రోజుల మ్యాచ్ లలో ఒకటి రంజీ ఛాంపియన్ కర్ణాటక జట్టుతో బంగ్లాదేశ్-ఏ జట్టు తలపడనుండగా, రెండో మ్యాచ్ లో భారత-ఏ జట్టుతో ఆడనుంది. సెప్టెంబర్ 16, 18, 20 తేదీలలో వన్డేలు ఆడతాయి. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు తొలి మూడు రోజుల మ్యాచ్, రెండో మూడు రోజుల మ్యాచ్ 27 నుంచి 29 వరకు జరుగుతాయి.

  • Loading...

More Telugu News