: ఉపాధ్యాయులది సమున్నత స్థానం: చంద్రబాబు
సమాజంలో ఉపాధ్యాయులది సమున్నత స్థానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్టణంలోని ఆంధ్రాయూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఉపాధ్యాయుల స్థానం పవిత్రమైనదని, దానిని పెంచే విధంగా టీచర్ల బోధన ఉండాలని సూచించారు. ఏపీలో టీచర్ల కొరత లేకుండా చేస్తామని ఆయన చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా మానవ వనరులు భారత్ సొత్తని ఆయన తెలిపారు. విద్యార్థులు సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకుని, లక్ష్యం దిశగా సాగిపోవాలని ఆయన హితబోధ చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, సరికొత్త లక్ష్యాలవైపు సాగిపోవాలని ఆయన స్ఫూర్తి రగిలించారు.