: ఇంద్రాణి పోలీస్ రిమాండ్ పొడిగింపు... విచారణకు సహకరించడం లేదన్న పోలీసులు
కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా పోలీస్ రిమాండ్ ను ముంబై స్థానిక కోర్టు ఈ నెల 7వరకు పొడిగించింది. ఆమెతో పాటు కేసులో నిందితులుగా ఉన్న ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ ల రిమాండ్ కూడా అదే తేదీ వరకు పొడిగించారు. నేటితో వారి రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అయితే షీనా హత్య కేసులో విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదని, కేసు విచారణ కోసం నిందితులకు రిమాండ్ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు. దాంతో న్యాయస్థానం రిమాండ్ పొడిగింపుకు అనుమతి ఇచ్చింది.