: గుంటూరు జిల్లా బేతంపూడిలో కొత్త కాలనీకి పవన్ కల్యాణ్ పేరు?


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాప్యులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయాల్లోకి రాకముందు వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇటీవల్ సామాన్య ప్రజానీకానికి కూడా మరింత దగ్గరవుతున్నారు. ఇందుకు నిదర్శనం, ఇటీవల ఆయన నవ్యాంధ్ర రాజధాని గ్రామాలైన పెనుమాక, బేతంపూడిలో పర్యటించడమే. గుంటూరు జిల్లాలోని బేతంపూడి గ్రామానికి పవన్ రెండుసార్లు వెళ్లారు. భూసేకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా పవన్ వ్యతిరేకించడంతో ప్రభుత్వం సైతం వెనక్కి తగ్గింది. దాంతో ఆ గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇందుకు కృతజ్ఞతగా ఇప్పుడు పవన్ పై బేతంపూడి గ్రామస్థులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారట. ఆ గ్రామంలో కొత్తగా ఓ కాలనీ నిర్మిస్తున్నారు. దానికి 'పవన్ కల్యాణ్ నగర్' అనే పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నందమూరి తారకరామారావు తరువాత ఈ అరుదైన గౌరవం పవన్ కే దక్కిందని అంటున్నారు.

  • Loading...

More Telugu News