: నా సోదరుడిపై దాడికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: డీకే అరుణ


కాంగ్రెస్ ఎమ్మెల్యే, తన సోదరుడు చిట్టెం రాంమోహన్ రెడ్డిపై దాడికి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. అంతేగాక దాడి చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.బాలరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అరుణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కులం పేరుతో దాడికి దిగడం తగదన్నారు. ఇలాంటి వ్యక్తులు బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో ఆలోచించాలని సీఎంకు అరుణ సూచించారు. మహబూబ్ నగర్ లో నిన్న (శుక్రవారం) జరిగిన జడ్పీటీసీ సమావేశంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో రాంమోహన్ రెడ్డిపై బాలరాజు చేయి చేసుకున్నారు.

  • Loading...

More Telugu News