: గ్రామ రాజకీయమంతా టీచర్ల చేతిలోనే!...‘టీచర్స్ డే’ వేదికపై నాయిని ఘాటు వ్యాఖ్య
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక వేదికపై ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామ రాజకీయాలన్నీ టీచర్ల చేతిలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక సర్కారీ ఉపాధ్యాయులు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ప్రైవేట్ పాఠశాలలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పరిణామాలకు మనమంతా సిగ్గుపడాలని కూడా నాయిని వ్యాఖ్యానించారు. సర్కారీ విద్యాలయాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిస్తూ నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు. నాయిని వ్యాఖ్యలతో వేదికపై ఉన్న డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు బిత్తరపోయారు.