: కర్నూలులో గ్యాస్ సిలిండర్ పేలుడు... 14 ఇళ్లకు వ్యాపించిన మంటలు


కర్నూలు నగరంలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని ధర్మపేటలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. సిలిండర్ పేలుడు కారణంగా ఆ ఇంటిలో ఎగసిన మంటలు క్షణాల్లో సమీపంలోని మరో 14 ఇళ్లకు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News