: అమెరికా విధానాలే యూరప్ దేశాల్లో శరణార్థుల సమస్యకు కారణం: పుతిన్
యూరప్ దేశాలైన మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల్లో శరణార్థుల సమస్యపై రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో తిరుగుబాటుదారులు సృష్టిస్తున్న అల్లకల్లోలం, శరణార్థుల సమస్యలకు అమెరికా విధానాలను గుడ్డిగా అమలు చేయడమే ప్రధాన కారణామన్నారు. అందుకే యూరప్ దేశాలు ప్రస్తుతం శరణార్థుల సమస్యను ఎదుర్కొంటున్నాయని, కానీ అదే అమెరికాపై ఆ సమస్య ప్రభావం అంతగా లేదని పేర్కొన్నారు. ఈ సమస్య రావొచ్చని తాము ముందే ఊహించామని వ్లాదివోస్తక్ లో జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ చెప్పారు. శరణార్థుల సమస్య పోవాలంటే సొంత దేశంలో పరిస్థితులు చక్కబడేందుకు యూరప్ ఎంతో కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఇస్లామిక్ స్టేట్ వంటి జిహాదీ గ్రూపులపై పోరాటం కోసం ఓ అంతర్జాతీయ యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని పుతిన్ అభిప్రాయపడ్డారు.