: యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా జోడీ ఓటమి
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ డబుల్స్ నుంచి భారత క్రీడాకారిణి సానియా మీర్జా జోడీ నిష్క్రమించింది. అన్ సీడెడ్ ఆండ్రియా-లూకాజ్ జోడీ చేతిలో 6-3, 6-3 తేడాతో సానియా-సోర్స్ జోడీ ఓటమి పాలయ్యారు. మరోవైపు ఇదే టోర్నీలో టాప్ సీడెడ్ సెరెనా విలియమ్స్ నాలుగో రౌండ్ కు చేరింది. మూడో రౌండ్ లో మాటెక్ సాండ్స్ పై 3-6, 7-5, 6-0 తేడాతో సెరెనా గెలుపొందింది. ఇదిలాఉండగా... మహిళల డబుల్స్ లో సానియా-మార్టినా హింగస్ జోడీ రెండో రౌండ్ చేరుకున్న విషయం తెలిసిందే.