: పోలీసుల అదుపులో 10 మంది పవన్ కల్యాణ్ అభిమానులు... ఆందోళనకు దిగిన పవర్ స్టార్ ఫ్యాన్స్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల మధ్య మూడు రోజుల క్రితం మొదలైన ‘ఫ్లెక్సీ’ వార్ నేపథ్యంలో భీమవరంలో పోలీసులు 144 సెక్షన్ నిషేధాజ్ఞలను విధించారు. అయితే పెచ్చరిల్లిన అల్లర్లను చల్లార్చే క్రమంలో పోలీసులు పవన్ కల్యాణ్ అభిమానులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో నేటి ఉదయం భీమవరంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడితో పాటు, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కూడా ప్రకటించారు.