: సాగర్ చుట్టూ ‘పరిక్రమ’ బైక్ ర్యాలీ... జలాల శుద్ధి కోసం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటి నిరసన
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ చుట్టూ కొద్దిసేపటి క్రితం ‘సాగర్ పరిక్రమ’ పేరిట భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. గణేశ్ నిమజ్జనంలోగా సాగర్ జలాలను శుద్ధి చేయాలని కోరుతూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బైక్ లతో పాల్గొంటున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ ర్యాలీ జరగనుంది. గణేశ్ నిమజ్జనం కారణంగా సాగర్ జలాలు అపరిశుభ్రమవుతున్నాయంటున్న కాలుష్య నియంత్రణ మండలి వ్యాఖ్యలకు నిరసనగానే ఈ ర్యాలీ చేపడుతున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాల వల్లే సాగర్ జలాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని వారు ఆరోపించారు. తక్షణమే పరిశ్రమల వ్యర్థాలను సాగర్ లో కలపడాన్ని ఆపాలని కూడా వారు డిమాండ్ చేశారు.