: అనుకరణతో బాహు'బలి' అయిన యువకుడు!
సినీ నటులు యువతను ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చెప్పే ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. రామగుండం మండలం ఎలుకపల్లికి చెందిన షబ్బీర్ (23) సమీపంలోని పెద్దపల్లి మండలం గట్టుసింగారం దగ్గరుండే జలపాతాలు చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ స్నేహితుల సమక్షంలో... బాహుబలిలో శివుడు తాను కలలు కంటున్న వ్యక్తి ముఖం చూసేందుకు జలపాతాలు, లోయలు, దాటుకుంటూ ఎత్తైన కొండలు ఎక్కే సన్నివేశాల్లోలా ఫీట్ చేయాలని భావించాడు. కొండపై నుంచి ఫీట్లు చేస్తుండగా ఎత్తైన కొండపై నుంచి కిందపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.