: ఈసారి మధ్యప్రదేశ్... ఐసీయూలో చిన్నారి ముక్కు కొరికిన ఎలుక
గుంటూరు జిల్లా ఆసుపత్రిలో ఎలుకలు కొరకడంతో చిన్నారి మృత్యువాత పడ్డ ఘటనను మరువక ముందే అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లోనూ జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒకటిన్నర నెల వయసున్న పసికందు ముక్కును ఓ ఎలుక కొరికేసింది. ఈ ఘటన ధార్ జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో అతడిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో, ఐసీయూలో ఉన్న ఆ పిల్లాడి ముక్కును ఎలుక కొరికేసింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఒక స్టాఫ్ నర్సును సస్పెండ్ చేశారు. కేర్ టేకర్ ను విధుల నుంచి తీసేశారు.