: సహ సంగీత దర్శకుడి ఆరోగ్యం పట్ల రెహ్మాన్ ఆవేదన!
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీనికి కారణం బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన ఆదేశ్ శ్రీ వాస్తవ్ క్యాన్సర్ బారిన పడటమే! గత నలభై ఐదు రోజులుగా కోకిల బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన కేన్సర్ కు చికిత్స పొందుతున్నారు. శ్రీ వాస్తవ్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందన్న విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని రెహ్మాన్ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. దైవ కృప, దీవెనలతో శ్రీ వాస్తవ్ కు ఉపశమనం లభించాలని రెహ్మాన్ కోరుకున్నారు. సుమారు 100 సినిమాలకు శ్రీ వాస్తవ్ సంగీత దర్శకత్వం వహించారు.