: వరంగల్ బరిలోకి గద్దర్ దిగుతారు: తమ్మినేని


వరంగల్ పార్లమెంట్ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల మద్దతుతో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేస్తారని, ఇందుకు ఆయన సుముఖంగానే ఉన్నారని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. గద్దర్ పోటీ చేస్తే మద్దతిస్తామని ఇప్పటికే వరంగల్ నియోజకవర్గ కాంగ్రెస్, తెదేపా నేతల నుంచి హామీ వచ్చిందని వివరించారు. ఈ మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెరాసను తరిమికొట్టడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News