: ఆసుపత్రి పెడతానని చెప్పి... శ్రీకాకుళంలో వైసీపీ నేత మోసం?
ఉద్యోగాలు ఇప్పిస్తాం, హోటల్ కడతామంటూ డబ్బులు వసూలు చేస్తున్న మోసాలు ఈ మధ్య చాలా చూస్తున్నాం. కొన్ని రోజుల కిందట జగ్గయ్యపేటలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వైసీపీ నేత నంబూరి రవి మోసం చేసిన ఘటన మరవక ముందే, మరో వైసీపీ నేత మోసం వెలుగులోకి వచ్చింది. ఆ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఆసుపత్రి పెడతామని చెప్పి ఓ డాక్టర్ నుంచి కోటి రూపాయలు వసూలు చేసి మోసిగించిన వైనం శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసింది. దానిపై వైద్యుడు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.