: చంద్రబాబుపై చెవిరెడ్డి ఘాటు వ్యాఖ్య... పక్క రాష్ట్రంలో దొరికిన దొంగ అని వ్యాఖ్య
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ అని ఆయనను చెవిరెడ్డి అభివర్ణించారు. సొంత రాష్ట్రంలో తప్పించుకుని పక్క రాష్ట్రంలో చంద్రబాబు పట్టుబడిపోయారని చెవిరెడ్డి ఆరోపించారు. తద్వారా ఏపీ పరువును పొరుగు రాష్ట్రంలో నిలువునా ముంచారని, భవిష్యత్తును తాకట్టు పెట్టారని కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. నేటి అసెంబ్లీ తొలుత వాయిదా పడ్డ తర్వాత బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సందర్భంగా చెవిరెడ్డి ఈ పదజాలాన్ని వాడారు. ఓటుకు నోటు కేసుపై దమ్ముంటే చర్చకు రావాలని కూడా ఆయన అధికార పక్షానికి సవాల్ విసిరారు. ఈ కేసు నుంచి బయటపడేందుకే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని కూడా చెవిరెడ్డి ఆరోపించారు.