: మీరు పరిష్కరించుకోండి లేదా మేం కల్పించుకుంటాం!: తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు అల్టిమేటం
విద్యుత్ ఉద్యోగుల అంశంపై హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాలకు అల్టిమేటం జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ అంశంపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల విద్యుత్ కార్యదర్శులు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది. అలా పరిష్కరించుకోని పక్షంలో తామే ఆదేశాలిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. కాగా, తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేయగా, ఏపీ వారిని ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయిన అనంతరం అందర్నీ ఒకేసారి విడుదల చేయాలని ఏపీ వాదిస్తోంది. దీంతో విద్యుత్ ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్న సంగతి తెలిసిందే.