: తెలంగాణలో స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా మంచు లక్ష్మి


సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మీ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఆమె తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. దానికి సంబంధించి ఈ నెల 10న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పలువురు ప్రముఖుల మధ్య లక్ష్మీ ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. దానిపై ఆమె స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో నా స్థాయిలో నేను ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం మరింత బాధ్యత పెంచిందని లక్ష్మీ పేర్కొన్నారు. రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ గౌరవాన్ని అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఇంతటి గౌరవాన్ని అందించిన ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News