: ఆస్ట్రేలియాలో వింత జంతువును చూసి బిత్తరపోయి... తర్వాత గుర్తుపట్టి నవ్వుకున్న స్థానికులు


ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా ప్రాంతంలో తెల్లవారు జామున ఓ వింత జంతువును చూసిన స్థానికులు షాక్ తిన్నారు. తరువాత దానిని పరీక్షగా చూసి అది ఊలు విపరీతంగా పెరిగిపోయిన గొర్రె అని గుర్తించి నవ్వుకున్నారు. సదరు గొర్రె యజమాని నుంచి తప్పించుకుని అడవిలో చిక్కుకుపోయింది. సుదీర్ఘకాలం దానిని పట్టించుకునేవారు లేకపోవడంతో దాని ఊలు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అది చిత్రంగా వింత జంతువులా కనిపించింది. దానిని గొర్రెగా గుర్తించిన అనంతరం నేరుగా ప్రభుత్వాధికారులకు అప్పగించారు. అయితే నిపుణులను రప్పించి, దానికి మత్తు ఇచ్చి, ఊలు ఒలిచారు. దాని శరీరం నుంచి ఒలిచిన ఊలుతో 30 స్వెర్టర్లు అల్లవచ్చని వారు తెలిపారు. ఊలు తొలగించిన అనంతరం అది ఆరోగ్యంగా ఉందని వారు వెల్లడించారు. 40 కేజీల ఊలుతో అది ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

  • Loading...

More Telugu News