: హోం శాఖలో మరో కీలక బదిలీ


కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి అనంతకుమార్ సింగ్ ను బదలీ చేశారు. పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారుడిగా నియమించారు. ఆయన బదలీ వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సంబంధిత శాఖాధికారులు అవుననే అనుమానం వెలిబుచ్చుతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో అనంతకుమార్ చనువుగా ఉండటం వల్లే ఈ బదలీకి ప్రధాన కారణమని సమాచారం. అనంతకుమార్ 1984 ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన అధికారి. డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు వచ్చారు. ఆయన్నిహోం శాఖ అదనపు కార్యదర్శిగా నియమించి కేవలం 8 నెలలు మాత్రమే అవుతుంది.

  • Loading...

More Telugu News