: రూ.5000 కోట్ల కోసం కేరళ కుటుంబ పోరాటం


ఏడాది, రెండేళ్లు కాదు, ఆరు దశాబ్దాలుగా ఒక కేరళ కుటుంబం సౌదీ ప్రభుత్వంతో పోరాడుతోంది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి సౌదీ ప్రభుత్వం 5వేల కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంది. కానీ వీరి అభ్యర్థనలను సౌదీ ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. ఫలితంగా వీరి సొమ్ము సౌదీ ట్రెజరీలో మూలుగుతోంది. దీంతో ఈ విషయంలో జోక్యం చేుసుకుని సౌదీ ట్రెజరీ నుంచి సొమ్ములు వచ్చేలా చూడాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా కోరింది.

కన్నూర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం 136 సంవత్సరాల కిందట సౌదీ అరేబియాలోని పవిత్ర పట్టణం మక్కాలో స్థలాన్ని కొనుగోలు చేసింది. అక్కడికి వచ్చే ముస్లింలు విశ్రాంతి తీసుకునేందుకు మందిరం నిర్మించింది. అయితే పెరుగుతున్న ముస్లిం సందర్శకులకు అనుగుణంగా పట్టణాన్ని విస్తరించాలని సౌదీ ప్రభుత్వ అధికారులు 1950లో కేరళీయుల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు పరిహారంగా 14లక్షల సౌదీ రియాళ్లను(ఒక రియాల్ మన రూపాయలలో 14.40) చెల్లించాల్సి ఉంది. వారసత్వానికి సంబంధించిన సరైన పత్రాలు సమర్పించకపోవడంతో ఈ సొమ్ము అప్పటి నుంచీ సౌదీ ట్రెజరీలోనూ ఉండిపోయింది. ఇప్పుడు దీని విలువ 5వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

  • Loading...

More Telugu News