: 'జనతా పరివార్'లో చీలిక... మహాకూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ అవుట్!


కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే లక్ష్యంగా ఏర్పడిన జనతాపరివార్ లో చీలికలొచ్చాయి. మహాకూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ బయటికొచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో తమను పట్టించుకోలేదన్న కారణంగానే కూటమి నుంచి ఎస్పీ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ప్రస్తుత బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ పై ములాయం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దానిపై ఎస్పీ జనరల్ సెక్రెటరీ రాం గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, బీహార్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించిందని చెప్పారు. అవసరమైతే మద్దతు కోసం కొన్ని ఇతర పార్టీలతో మాట్లాడతామన్నారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తమను సంప్రదించలేదని, లాలూ, నితీశ్ కుమార్ ల ఎత్తుగడలను తాము అవమానంగా భావిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News