: నాడు అల్ట్రా మోడ్రన్ లగ్జరీ, నేడు ఫ్యాన్ కూడా లేని గదిలో... జైల్లో ఇంద్రాణి ఎలా ఉందంటే...!


లగ్జరీ కార్లు, పిలిస్తే పరిగెత్తుకొచ్చే పనివాళ్లు, అడుగు వేయాలంటే విమానాలు, నిత్యమూ పార్టీలు... ఇలా అల్ట్రా మోడ్రన్ లైఫ్ ను అనుభవించిన ఇంద్రాణి, నేడు జైల్లో మగ్గుతోంది. కన్న కూతురిని హత్య చేసిన కేసు విషయమై ఆమె ముంబై జైల్లో ఉండగా, జైలు అధికారులు సాధారణ ఖైదీగానే చూస్తున్నారు. ఆమె పడుకోవడానికి ఒక చాపను మాత్రమే ఇచ్చారు. ఆమె ఉన్న గదిలో ఫ్యాన్ కూడా లేదు. కేవలం ఒక్క కిటికీ మాత్రమే ఉంది. అది కూడా చాలా ఎత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయం అల్పాహారంగా వడా పావ్, టీలను ఆమెకు ఇస్తున్నారు. ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని ఆమెకు ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరించారు. ఆ ఆహారంలో విషం కలపవచ్చన్న అనుమానాలు తమకున్నాయని వారు స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా సమక్షంలో ఆమెతో పాటు ఇతర నిందితులను కూర్చోబెట్టిన పోలీసులు కేసును మరింత లోతుగా విచారణ జరిపినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News