: అమితాబ్ తరువాత సంగక్కర వంతు... హ్యాకర్ల బారిన ట్విట్టర్ అకౌంట్!


బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హ్యాకర్ల బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర ట్విట్టర్ ఖాతా హ్యాకర్ల బారినపడింది. సంగక్కరకు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీంతో సంగక్కర ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు ఆయన ఖాతాలో అభ్యంతరకర ఫోటోలు పోస్టు చేశారు. దీంతో సంగక్కర అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. తన ఖాతా హ్యాకింగ్ కు గురైందని, తాను చెప్పేంత వరకు తన ఖాతాలో వచ్చే అభ్యంతరకర పోస్టులను పట్టించుకోవద్దని సంగ సూచించాడు.

  • Loading...

More Telugu News