: కట్టప్పను వదిలేశారు...షీనా బోరాను పట్టుకున్నారు!


బాహుబలి సినిమా విడుదలైన నాటి నుంచి ఇటీవలి వరకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్న 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అన్నదే! దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ జవాబులు రాశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు కట్టప్పను మర్చిపోయారు. తాజాగా షీనా బోరా హత్యకేసుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో షీనా బోరాని ఇంద్రాణి ముఖర్జియా ఎందుకు చంపేసింది? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాంగోపాల్ వర్మ కూడా ట్విట్టర్లో ఓ చిత్రమైన ఫోటో పెట్టి, 'ముఖర్జియాస్ గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' అంటూ కామెంట్ పెట్టాడు. షీనా హత్య కేసు తేలిన తరువాతే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుస్తుందని మరో నెటిజన్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.

  • Loading...

More Telugu News