: మంత్రి తలసానిపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని రాణీగంజ్ బస్తీవాసులను ఖాళీ చేయాలని తలసాని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనతో పాటు రాణీగంజ్ బస్తీవాసులు కూడా తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఈ సందర్భంగా కోరారు.