: వైఎస్ వర్థంతి సందర్భంగా ఉల్లిపాయలు పంపిణీ చేశారు


మాములుగా వర్థంతులు, జయంతి కార్యక్రమాలకు పండ్లు, దుస్తులు, ఇంకా పలురకాలను రోగులకు పంపిణీ చేస్తుంటారు. అలాగే ఇవాళ వైఎస్ వర్థంతి కావడంతో పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు, పలుచోట్ల ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కానీ విజయవాడలో మాత్రం వైసీపీ నేతలు కాస్త విభిన్నంగా ఆలోచన చేశారు. ప్రస్తుతం ధర ఎక్కువగా ఉన్న, ప్రజలకు అత్యంత అవసరమైన ఉల్లిపాయలు అందిస్తే బాగుంటుందని అనుకున్నారు. దాంతో విజయవాడ సీతారామపురం కొత్త వంతెన వద్ద స్థానిక వైసీపీ నేతలు ప్రజలకు ఉల్లిపాయలు పంపిణీ చేశారు. దానిపై పలువురు అనందం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News