: ఇక చమురు క్షేత్రాలకూ వేలం పాటే... కేంద్రం సంచలన నిర్ణయం
చమురు క్షేత్రాలను కూడా ఇకపై వేలం పాటల ద్వారానే ఆయా సంస్థలకు కట్టబెట్టాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా చమురు క్షేత్రాల కేటాయింపుల కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ద్వారా రిలయన్స్ లాంటి కొన్ని సంస్థలు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నాయి. ఈ తరహా కంపెనీల గుత్తాధిపత్యానికి వేలం పాట ద్వారా చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బొగ్గు గనుల కేటాయింపు కోసం చేపట్టిన వేలం ప్రక్రియ తరహాలోనే చమురు క్షేత్రాలకు కూడా వేలం పాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.