: ముర్షిదాబాదులో రణరంగం... తృణమూల్, లెఫ్ట్ ల మధ్య ఘర్షణ, పోలీసుల కాల్పులు
కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె పశ్చిమ బెంగాల్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సమ్మెలో భాగంగా ఆ రాష్ట్ర నగరం ముర్షిదాబాదులో అధికార తృణమూల్, వామపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి పరస్పరం ఘర్షణకు దిగారు. రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం రెండు పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.