: సోనమ్ నవ్వుకు 100 వాట్ల వెలుగుందంటున్న హృతిక్
"సోనమ్ కపూర్ నవ్వుకు 100 వాట్ల వెలుగుంది. తను చాలా ఎనర్జిటిక్... అంతేకాదు, తెలివైన వ్యక్తి కూడా" అంటూ కితాబిచ్చాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ఇటీవల వారిద్దరిపై దర్శకుడు అహ్మద్ ఖాన్ రూపొందించిన 'దీరే దీరే...' పాటను ముంబైలో తాజాగా విడుదల చేశారు. ఈ లాంచింగ్ కార్యక్రమానికి వచ్చిన హృతిక్ చాలా అసక్తికరమైన విషయాలు తెలిపాడు. ప్రేమ అంశంతో ముడిపడిన ఈ పాటను మీరెవరికి అంకితమిస్తారు? అని ఈ విలేకరులు ప్రశ్నించగా, తన జీవితంలో అలాంటి వారు ఎవ్వరూ లేరని చెప్పాడు. అదే సమయంలో సోనమ్ గురించి మాట్లాడుతూ, ఈ పాట చాల్ హాట్ గా ఉంటుందని, సోనమ్ కూడా అంతే హాట్ గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆమెతో కలసి పనిచేయడం ఇది రెండోసారి అని చెప్పాడు. అయితే నటి కంగనా రనౌత్ తో మీ రొమాన్స్, రిలేషన్ గురించి చెప్పండని మళ్లీ మీడియా అడగడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసిన హృతిక్, 'ఓరి దేవుడా... దీనిపై నేనేం చెప్పాలి?' అంటూ అసలు విషయాన్ని దాటవేశాడు.