: పాము పుట్టలో ఉంది... అవసరమైతేనే బయటకు వస్తుంది: యనమల


టీఆర్ఎస్ నేతలతో వైకాపా అధినేత సమావేశం అయ్యారనడానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, అవి ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రావని ఏపీ శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. "పాము పుట్టలో ఉంది. అది అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. జగన్, తెరాస నేతల భేటీ సాక్ష్యాలు కూడా అంతే" అని ఆయన అన్నారు. నేటి అసెంబ్లీలో యనమల, మరో మంత్రి అచ్చెన్నాయుడి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తాను నిన్న జగన్, టీఆర్ఎస్ లీడర్లు సమావేశమైన తేదీని వెల్లడించానని, ఆ దృశ్యాలను తొలగించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనికి స్పందించిన యనమల, తొలగించడానికి ముందే ఆ దృశ్యాలను సేకరించి పెట్టామని, అవసరమైనప్పుడు మాత్రం అవి బయటకు వస్తాయని అన్నారు. తమను భయపెట్టాలని అధికార పక్షం ప్రయత్నిస్తోందని, వారి ఉద్దేశం నెరవేరబోదని వైకాపా వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News