: మీరంతా పతివ్రతలా?... సి.రామచంద్రయ్య వివాదాస్పద వ్యాఖ్య, భగ్గుమన్న ప్రతిభా భారతి


ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి. రామచంద్రయ్య నిన్న విదాస్పద వ్యాఖ్య చేశారు. కరవుపై చర్చ సందర్భంగా ఆయన కట్టు తప్పారు. అధికార టీడీపీ సభ్యులను ఉద్దేశించి ఆయన ‘‘మీరంతా పతివ్రతలా?’’ అంటూ వ్యాఖ్యానించారు. రామచంద్రయ్య వ్యాఖ్యలపై టీడీపీ మహిళా ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. రామచంద్రయ్య వ్యాఖ్యల సందర్భంగా సభలోనే ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిండు సభలో అనుచిత వ్యాఖ్యలతో ఆడవాళ్లను అవమానిస్తారా? తక్షణమే క్షమాపణ చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. రామచంద్రయ్య క్షమాపణ చెప్పేదాకా సభను జరగనివ్వబోమని ఆమె తేల్చిచెప్పారు. తన వ్యాఖ్యలపై ఒక్కసారిగా నిరసన వెల్లువెత్తడంతో రామచంద్రయ్య మౌనంగా తన పార్టీ సభ్యులను తీసుకుని బయటకు వెళ్లిపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News