: నా రోల్ మోడల్ మాస్టర్ బ్లాస్టరే... సచిన్ ని దేవుడితో పోల్చిన జార్ఖండ్ డైనమైట్!


టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా పర్యటనలో భాగంగా నిన్న భారతరత్న సచిన్ టెండూల్కర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన రోల్ మోడల్ సచినేనని అతడు వ్యాఖ్యానించాడు. ఆట పట్ల నిబద్ధత, అంకితభావం చూపే సచిన్ తనకు నిజంగానే రోల్ మోడల్ అని కూడా అతడు అన్నాడు. అంతేకాక సచిన్ తనకు దేవుడిలాంటి వాడని కూడా మహీ పేర్కొన్నాడు. తనకే కాక అందరికీ కూడా సచిన్ స్ఫూర్తి ప్రదాత అని కూడా చెప్పాడు. ‘‘సచిన్ ఆట చూస్తూనే పెరిగాం. మా అందరికీ అతడు దేవుడితో సమానం’’ అని ధోనీ అన్నాడు.

  • Loading...

More Telugu News