: 65 ఏళ్ల మురికిని ఐదేళ్లలో కడిగిపారేస్తాం: టీ మంత్రి కేటీఆర్
సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వరుస విమర్శలను తిప్పికొట్టేందుకు తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) రంగంలోకి దిగారు. 65 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఏ మేరకు అభివృద్ధి చేశాయో ప్రజలకు తెలుసని కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన అన్నారు. గడచిన 65 ఏళ్లలో తెలంగాణలో పేరుకుపోయిన మురికిని ఐదేళ్లలో కడిగిపారేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలను దాస్తూ ప్రాజెక్టుల బాట పడితే కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యం మరుగునపడిపోదని కూడా ఆయన పేర్కొన్నారు.