: బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడు దొరికాడు


బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడు దొరికాడు. ఆగస్టు 17న బ్యాంకాక్ నడిబొడ్డున ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బ్రహ్మదేవాలయం దగ్గర పేలుళ్లకు పాల్పడిన వ్యక్తిని బ్యాంకాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బన్ పా రాయ్ సరిహద్దు గుండా బర్మాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఈ విదేశీయుడ్ని బ్యాంకాక్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని థాయ్ లాండ్ ప్రధాని ప్రయుత్ ఛానో ఛా తెలిపారు. అయితే ఆ వ్యక్తి విదేశీయుడైనందున సమగ్ర దర్యాప్తు తరువాతే అతడు ఎవరు? ఎందుకు పేలుళ్లకు పాల్పడ్డాడు? అతని వెనుక ఎవరున్నారు? వంటి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. కాగా, ఆనాటి పేలుళ్లలో 20 మంది మృత్యువాతపడగా, వంద మంది క్షతగాత్రులయ్యారు.

  • Loading...

More Telugu News