: సమ్మెపై కార్మికులు పునరాలోచించుకోవాలి: దత్తాత్రేయ
రేపు దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగసంఘాలు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. దేశహితం, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కార్మికులు పునరాలోచించుకోవాలని, సమ్మె విరమించుకోవాలని సూచించారు. బిఎంఎస్, ఎన్ఎఫ్ఐటీయూలు సమ్మె చేయట్లేదని ప్రకటించాయని, మూడు, నాలుగు కార్మిక సంఘాలు మధ్యస్థంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో సమ్మె ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్పలేమన్నారు. కార్మిక చట్టాల సరళీకరణపై కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దత్తాత్రేయ తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలను, రహదారి రవాణా భద్రత బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని, కార్మికుల కనీస వేతనాలను రూ.15వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేయబోతున్నారు.